Bhainsa, Nirmal, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పోలీసులు ముందస్తుగా బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని భైంసా బీజేపీ టౌన్ అధ్యక్షుడు రావుల రాము ఆరోపించారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆయన విమర్శించారు.
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి భైంసా బీజేపీ టౌన్ అధ్యక్షుడు రావుల రాము భైంసా: విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమానికి పోలీసులు ముందస్తుగా బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని భైంసా బీజేపీ టౌన్ అధ్యక్షుడు రావుల రాము ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను ఉద్యమాలకు దూరం చేయలేరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అరెస్టులు తమకు కొత్తేమీ కాదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు కొనసాగిస్తామని రావుల రాము పేర్కొన్నారు.












