జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన తానూర్ మాజీ జెడ్పీటీసీ ఉత్తం భలేరావును ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన తానూర్ మాజీ జెడ్పీటీసీ ఉత్తం భలేరావును ఎమ్మార్పీఎస్ నాయకులు పూజారి లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు పూజారి లక్ష్మణ్ మాట్లాడుతూ, మా దళిత ముద్దుబిడ్డ ఉత్తం భలేరావుకు జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్ష పదవి లభించడం పట్ల ఎంతో గర్వంగా ఉంది. ప్రజల సమస్యల పరిష్కారంలో, దళితుల హక్కుల సాధనలో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో ఆయనకు రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు దక్కాలని, ప్రజాసేవలో ఆయన మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన నాయకులకు, సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులకు ఉత్తం భలేరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి లక్ష్మణ్, గౌతం అనిల్, సోన్బా, సాయిప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.












