మండలంలోని రాజుర గ్రామానికి చెందిన గౌరవ దర్శనం సాయన్న నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగానికి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామకంపై మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
మండలంలోని రాజుర గ్రామానికి చెందిన గౌరవ దర్శనం సాయన్న నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగానికి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ విభాగానికి సాయన్న గారిని ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, యువ నాయకులు, ఖానాపూర్ శాసనసభ్యులు శ్రీ వెడ్మ భోజ్జు పటేల్, తెలంగాణ రాష్ట్ర సెల్ అధ్యక్షులు, మనకొండూరు శాసనసభ్యులు శ్రీ కవ్వం పల్లి సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు శ్రీ సమతా సుదర్శన్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు శ్రీ తూర్పాటి వెంకటేష్, నిర్మల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ కట్ట శ్యామ్ లకు మాజీ శాసనసభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ముత్తా గౌడ్, సర్పంచ్ చరణ్, ఉప సర్పంచ్ రమేష్, నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ దత్తు గౌడ్, మాజీ సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్ శ్రావణ్, రాకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.











