షహీద్ భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్లో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నంది రామయ్య గారు హాజరై మాట్లాడారు.
ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
భగత్ సింగ్ ఒక గొప్ప మార్క్సిస్టు మేధావి
నంది రామయ్య గారు మాట్లాడుతూ, భగత్ సింగ్ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదని, దోపిడీ లేని సమసమాజం కోసం, సమ సమాజ స్థాపన కోసం కలలు కన్న గొప్ప మార్క్సిస్టు మేధావి అని అన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల కార్మికులు, రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు ప్రజల జీవనాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశయాల కొనసాగింపు ఆవశ్యకత
కార్మిక కర్షక లోకం భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టి నిర్మల్ జిల్లా కార్యదర్శి కె.రాజన్న, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రామ లక్ష్మణ్, బక్కన్న, కె.లక్ష్మీ, ఎస్.గంగన్న, వి.మహేందర్ మరియు పార్టీ నాయకులు .గఫూర్, కిరణ్ తో పాటు కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.












