అణగారిన వర్గాల హక్కుల కోసం వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు.
ధీర మహిళ చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఐలమ్మ గారి విగ్రహానికి రజక సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే బిఎల్ఆర్, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ లతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి సమాజానికి ఎప్పటికీ ఆదర్శమన్నారు.
చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జావిద్, ఎండి హామీదుద్దీన్ (మోయిజ్), జిల్లా కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, వన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోడి రెక్క ఇంద్ర కుమార్, మాజీ కౌన్సిలర్లు కొమ్ము శ్రీనివాస్, యాదగిరి, రజక సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












