జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి. నర్సారెడ్డి జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ ఎదుట మాజీ పీసీసీ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి. నర్సారెడ్డి జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల హరీష్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












