జిల్లా షాద్ నగర్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన కీలక పాత్ర చిరస్మరణీయమని ఎమ్మెల్యే శంకర్ కొనియాడారు.
తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఆయన త్యాగం, నిబద్ధత, ప్రజాసేవ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేమని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం, షాద్ నగర్ తాలూకా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మూలే జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్, కన్వీనర్ నక్క బాల్ రాజ్ యాదవ్, హెల్త్ మోటివేటర్ జక్కుల శ్రీనివాస్, ఆర్ఐ వెంకట్ రెడ్డి, వి.రామారావు, మందారం నరసింహులు, ట్రెజరర్ గోర్ల రాము, జంగయ్య, బాలస్వామి, బి.నర్సింలు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు నలమోని శ్రీధర్, చెంది తిరుపతిరెడ్డి, ఇబ్రహీం, ముబారక్, దర్శన్, కౌన్సిలర్లు బచ్చలి నరేష్, జమాల్పూర్ చందు, ఖదీర్, హాజిపల్లి సర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు విష్ణు, నవీన్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

