మండలం, తాండ్ర గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు అర్హులైన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ కార్డుల ద్వారా రేషన్ సరుకులతో పాటు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయని తెలిపారు.
తాండ్ర గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూచాడి శ్రీహరిరావు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు రేషన్ సరుకులను పొందడమే కాకుండా, వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి దోహదపడతాయని తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందేలా చర్యలు కొనసాగుతాయని, పేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు
ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, తాండ్ర సర్పంచ్ కస్తూరి భాస్కర్, ఉప సర్పంచ్ రాథోడ్ సూషేన్, గయద్పల్లి సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాథోడ్ సంతోష్, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, వస్తాపూర్ సర్పంచ్ భూమారెడ్డి, బురుగుపల్లి సర్పంచ్ భూమన్న, గొండుగూడ సర్పంచ్ భీంరావు, మాజీ ఎంపీపీ జైసింగ్, మాజీ ఎంపీటీసీ అన్వర్, కిషన్రావుపేట్ సర్పంచ్ రాథోడ్ వసంత్, పొన్కల్ గంగారెడ్డి, కైరి రాకేష్ గౌడ్, బాదావత్ రమేష్, సాయగౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, లబ్ధిదారులు పాల్గొన్నారు.












