కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి 55 రోజులుగా కర్నూలు సబ్జైల్లో నిర్బంధించిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ నియోజకవర్గ ఇంఛార్జ్, గుంతకల్ మాజీ శాసనసభ్యులు వై. వెంకటరామిరెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే విరూపాక్షితో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి 55 రోజులుగా కర్నూలు సబ్జైల్లో నిర్బంధించిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ నియోజకవర్గ ఇంఛార్జ్, గుంతకల్ మాజీ శాసనసభ్యులు వై. వెంకటరామిరెడ్డి పరామర్శించారు.
కర్నూలు సబ్‌జైలుకు వెళ్లిన వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షితో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హిందూపురం మాజీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, రాష్ట్ర మాజీ మైనింగ్ డైరెక్టర్ పులివెందుల వీర ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర మాజీ వీరశైవ కార్పొరేషన్ డైరెక్టర్ పాటిల్ యుగంధర్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు తిక్కస్వామి తదితరులు పాల్గొన్నారు.


