కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిన వందల ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎస్సీ ఎస్టీ ప్రజలకు పంచడం ఖాయమని నిర్మల్ జిల్లా ఆదివాసి చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కబ్జాలపై సమగ్ర విచారణ ఆదేశించడానికి స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు.
నిర్మల్ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిన వందల ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎస్సీ ఎస్టీ ప్రజలకు పంచడం ఖాయమని నిర్మల్ జిల్లా ఆదివాసి చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కబ్జాలపై సమగ్ర విచారణ ఆదేశించడానికి స్వాగతిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులతో పూర్తిస్థాయిలో సర్వే చేయించి, ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అలా స్వాధీనం చేసుకున్న భూములను ఎస్సీ ఎస్టీ వర్గాలకు పంపిణీ చేయాలని వారు కోరారు. 2004 ఎన్నికల సమయంలో తనకు ఎలాంటి భూమి లేదని పేర్కొన్న కేసీఆర్, ఇంత స్వల్ప వ్యవధిలోనే ఆయన కుటుంబం వందల ఎకరాలకు యజమానులు ఎలా మారిందో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.
ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, ప్రభుత్వ భూములను తమ పేర్లలోకి మార్చుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో ధరణి పోర్టల్ నుంచి అనుభవదారులు అనే కాలమ్‌ను తొలగించి, ఎస్సీ ఎస్టీలను వారి భూములకు దూరం చేశారని మండిపడ్డారు. లక్షలాది మంది ప్రజల భూములు, ఇళ్లను 22ఏ జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. ఒకప్పుడు అంబాసిడర్ కారులో తిరిగిన కల్వకుంట్ల కుటుంబానికి ఎన్ని వేల కోట్ల ఆస్తులు, భూములు ఎక్కడి నుంచి వచ్చాయో శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిన కేసీఆర్ కుటుంబం తరతరాలకు సరిపడా ఆస్తులను కూడబెట్టుకుందని. దీనిపై చట్టపరమైన చర్యలు తప్పవని గోవింద నాయక్ హెచ్చరించారు. లబ్బర్ చెప్పులతో తిరిగిన హరీష్ రావుకు ఇన్ని వేల ఎకరాల భూమి ఎక్కడినుండి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబమే లక్ష కోట్ల భూదోపిడి చేసిందని ప్రజలు సైతం నమ్ముతున్నారని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో రైతుల భూములను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు.












