మనుషుల ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ.. ఈ మూడు అంశాలు ఒకదానితో మరొకటి విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఒక ప్రాంతంలో జంతువులకు సోకే వ్యాధులు, పర్యావరణంలో వచ్చే మార్పులు చివరకు మనుషుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. అందుకే ఈ మూడింటినీ ఒకే వ్యవస్థలో భాగంగా పరిగణించి వ్యాధులను ముందుగానే గుర్తించి అరికట్టే విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. దీనినే వన్ హెల్త్ (ఒకే ఆరోగ్యం) విధానంగా పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ వన్ హెల్త్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మనుషులు, జంతువులు, పర్యావరణం మధ్య ఉన్న సంబంధాన్ని, వ్యాధుల నియంత్రణలో సమన్వయంతో కూడిన చర్యల అవసరాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
మనుషుల ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ.. ఈ మూడు అంశాలు ఒకదానితో మరొకటి విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఒక ప్రాంతంలో జంతువులకు సోకే వ్యాధులు, పర్యావరణంలో వచ్చే మార్పులు చివరకు మనుషుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. అందుకే ఈ మూడింటినీ ఒకే వ్యవస్థలో భాగంగా పరిగణించి వ్యాధులను ముందుగానే గుర్తించి అరికట్టే విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. దీనినే వన్ హెల్త్ (ఒకే ఆరోగ్యం) విధానంగా పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ వన్ హెల్త్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మనుషులు, జంతువులు, పర్యావరణం మధ్య ఉన్న సంబంధాన్ని, వ్యాధుల నియంత్రణలో సమన్వయంతో కూడిన చర్యల అవసరాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాధుల ముప్పు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వెలుగులోకి వస్తున్న మానవ అంటువ్యాధుల్లో సుమారు 75 శాతం జంతువుల నుంచి వ్యాపించేవేనని అంచనాలు చెబుతున్నాయి. పశువులు, అడవి జంతువులు, పక్షులు, కీటకాలు, వాటి నివాస ప్రాంతాల్లో చోటుచేసుకునే మార్పులు అంటువ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి.
భారత్‌లో పశుసంపద అధికంగా ఉండటం వల్ల ఈ అంశం మరింత కీలకంగా మారింది. దేశంలో సుమారు 140 కోట్ల జనాభాతో పాటు 53.6 కోట్ల పశుసంపద ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో పశువులకు వచ్చే వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే రైతుల ఆదాయం, పాల ఉత్పత్తి, ప్రజల పోషకాహారంపై ప్రభావం పడుతుంది. భారత్‌లో ఇటీవల పశువులను ప్రభావితం చేస్తున్న లంపీ స్కిన్ డిసీజ్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి పరిధిలోని జాతీయ పశువ్యాధుల రోగ నిర్ధారణ, ఎపిడెమియాలజీ సంస్థ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ సెప్టెంబర్‌లో విడుదల చేసిన అంచనాల ప్రకారం, దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 219 జిల్లాలకు ఈ వ్యాధి ముప్పు ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌లోని పది తూర్పు జిల్లాల్లో సెప్టెంబర్ మధ్య నాటికి 10,400కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నేరుగా మనుషులకు సోకకపోయినా పశువుల పాల ఉత్పత్తి తగ్గడం, రైతుల ఆదాయం దెబ్బతినడం, గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపడం వంటి సమస్యలు ఎదురవుతాయి. 202223లో దేశవ్యాప్తంగా లంపీ స్కిన్ వ్యాధి కారణంగా 1.6 లక్షలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి.
మరోవైపు రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ప్లేగు వ్యాధికి సంబంధించిన అనుమానాలు కలకలం రేపాయి. ఇర్కుట్స్క్‌లోని ప్లేగు నిరోధక సంస్థలో పనిచేసే యువ సాంకేతిక నిపుణుడు అక్టోబర్ ప్రారంభంలో గుర్తుతెలియని న్యుమోనియాతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుమారు 200 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు సమాచారం. ప్లేగుకు కారణమయ్యే యెర్సీనియా పెస్టిస్ బ్యాక్టీరియా ఎలుకలు, ఇతర వన్యప్రాణులు, వాటిపై ఉండే ఈగల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి చరిత్రలో పెద్ద సంఖ్యలో ప్రాణాలను బలిగొన్నప్పటికీ, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దాని ఉనికి కొనసాగుతోంది. ఇలాంటి సందర్భాల్లో జంతువుల ఆరోగ్యం, పర్యావరణ పరిస్థితులు, ప్రయోగశాలల భద్రత, ప్రజారోగ్య వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సలహా మండలి సూచనల మేరకు జాతీయ వన్ హెల్త్ మిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రధాన శాస్త్రీయ సలహాదారు ఆధ్వర్యంలో 16 మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ మిషన్ పరిశోధన కార్యక్రమాలకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.386.86 కోట్ల నిధులు ఆమోదించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జాతీయ వన్ హెల్త్ సంస్థను ఏర్పాటు చేయడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది. అంటువ్యాధులను ముందుగానే గుర్తించేందుకు మనుషులు, జంతువులకు సంబంధించిన పరిశోధనశాలల మధ్య సమన్వయం పెంచుతున్నారు. జాతీయ స్థాయిలో ఉమ్మడి వ్యాధి నిర్ధారణ, పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నారు.











