బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యవస్థ నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో నుంచి వర్షాలు పెరిగే అవకాశం ఉంది.
తుపానుగా మారితే దీనికి అర్నబ్ అని పేరు పెట్టే అవకాశం ఉంది. 27, 28 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది న వాయుగుండంగా, 25న తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా.
తుపానుగా మారే సూచనలు
అనంతరం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారవచ్చని తెలిపింది. ఈ వ్యవస్థ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉదయం నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపించే అవకాశం ఉందని తాజా వాతావరణ బులెటిన్ పేర్కొంది. అయితే తుపాను తీరం దాటే ఖచ్చితమైన ప్రాంతం, సమయం ఇంకా నిర్ధారణ కాలేదు. వ్యవస్థ కదలికలు, తీవ్రతను బట్టి అంచనాల్లో మార్పులు ఉండవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ప్రజలకు హెచ్చరికలు
కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైతే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితి ఏర్పడవచ్చు. రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగడం, వ్యవసాయ పంటలు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రంలో గాలుల వేగం పెరిగే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
జాగ్రత్తలు
సముద్రంలో ఉన్నవారు భారత వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. తీరప్రాంత ప్రజలు స్థానిక అధికారుల నుంచి వచ్చే హెచ్చరికలను గమనించాలని, అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాల సూచనలు పాటించాలని కోరింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవసరం లేకుండా వర్షంలో బయటకు వెళ్లరాదు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలి. వాగులు, కాలువలు, పొంగిపొర్లే నీటి ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించరాదు. రైతులు పంటలు, వ్యవసాయ పరికరాల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి.
తుపాను ఏర్పడే అవకాశం ఉందన్న అంచనా ఆధారంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మకుండా, భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారిక ప్రకటనలను అనుసరించాలని కోరారు. అత్యవసర సహాయం కోసం 112, 1070 లేదా 1800-425-0101 నంబర్లను సంప్రదించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

