కాంగ్రెస్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడెం వాసులు ముత్యాల పరమేశ్వరి అమ్మవారికి ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించారు.
ఘనంగా ముత్యాల పరమేశ్వరి అమ్మవారి బోనాలు : ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రత్యేక పూజలు మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడంలో ముత్యాల పరమేశ్వరి అమ్మవారికి ఘనంగా ఈధులగూడెం వాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలుసమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ముత్యాల పరమేశ్వరి అమ్మవారి కృప వలన ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించి వర్షాలు కురిసి మంచిగా పంటలు పండి రైతులు, ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ముత్యాల పరమేశ్వరి అమ్మవారిని ప్రార్థించారు. ఆయన వెంట వెంట కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బ్లాక్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, మిర్యాలగూడ పట్టణ మాజీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, 5 వ వార్డు ఇన్చార్జి కేతావత్ జవహర్ నాయక్, 4 వ వార్డ్ కౌన్సిలర్ పుట్టపాక శ్రీనివాస్, ఆలయ నిర్వాహకులు ముదిరెడ్డి యాదగిరి రెడ్డి,మన్నెం శ్రీనివాస్ రెడ్డి,మన్నెం సైదిరెడ్డి , మాలి శ్రీనివాస్ రెడ్డి , శ్రీనివాస్ , బిక్షం, శేఖర్ గడగోజు అశోక్, సైదులు, వేణు, అభి, ప్రవీణ్, మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












