దూది గం గ్రామం, మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 08
మెండోరా మండలం దూది గం గ్రామంలో ఇందిరమ్మ గృహాలను గ్రామ సర్పంచ్ రషీద్ బాబా, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ప్రారంభించారు.
దీపావళి పండుగ సందర్భంగా ప్రారంభించిన ఈ గృహాల్లో వెలుగులు నింపినట్లుగా లబ్ధిదారు మచ్చర్ల రాజమణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పంచాయతీ కార్యదర్శి నీలేశ్, జ్ఞాని, కుటుంబ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

