చైతన్య నగర్, నల్గొండ (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 15
మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లోని శిష్య స్కూల్లో శనివారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస రెడ్డి, కరస్పాండెంట్ శిరీషలు మాట్లాడుతూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అదేవిధంగా నర్సరీ, ఎల్.కె.జి., యూ.కె.జి. విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ షో నిర్వహించారు. యూ.కె.జి. విద్యార్థులు అన్షుశ్రీ, ఝాన్సీ, లక్ష్మీబాయిగా, జాన్వి మిత్ర డాక్టర్ గా, లవ కుమార్ నెహ్రుగా, కృతిక, దాన్విక గోపికమ్మగా, ఎల్.కె.జి. నుండి అర్ణిక రుద్రమదేవిగా, తిష్య హెయిర్ హోష్టిస్ గా, ఒమిక అన్షు లాయర్ గా, హస్వి నేతాజీగా, దేవాన్ష్ పోలీస్ గా, హరియాక్స్ దియాన్ష్ అల్లూరి సీతారామరాజు గా, అర్జున్ రాముడిగా, నర్సరీ నుండి నిషిత బటర్ఫ్లైగా, సుహాన్ పోలీస్ గా వివిధ వేషధారణలో అలరించి, అందరి ప్రశంసలు పొందారు.
నెహ్రూ సేవలు
ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, భారతదేశానికి తొలి ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా సేవలందించారని తెలిపారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి భారీ పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఐఐటీ, ఐఐఎంల ఏర్పాటుకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలను కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

