బీజేపీ (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 14
నిర్మల్ నియోజకవర్గంలోని రాచాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనం మరియు వివో (..) భవనాలను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ భవనాలు దోహదపడతాయని ఆయన తెలిపారు.
నిర్మల్ నియోజకవర్గంలోని రాచాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనం మరియు వివో (..) భవనాలను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సంఘాల కార్యకలాపాలకు అవసరమైన వసతుల కల్పన, చిన్నారులకు మెరుగైన అంగన్వాడీ సేవలు అందించడం లక్ష్యంగా ఇటువంటి భవనాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు తక్కల రమణారెడ్డి, ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షులు చిన్నయ్య, స్థానిక సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

