నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్దుల కుంట గ్రామంలోని ఉన్నత పాఠశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల హెచ్ఎంగా యశ్వంత్, పీఈటీగా గుమ్ముల సుశాంత్, కర్మచారులుగా తిరుమల రితీష్, రిషి వ్యవహరించగా, మిగతా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్ర పోషించారు.
తదుపరి, ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు తమ నృత్యాలతో అలరించి ఆనందంగా గడిపారు. అనంతరం, ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు భూమా రెడ్డి, ఉపాధ్యాయులు కడారి దశరథ్, ముర్తూజాఖాన్, విశ్వనాథ్, సౌజన్య, బద్దం సాయిరెడ్డి, స్కావెంజర్ కొండూరు మల్లేశ్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.






