కుబీర్, 12 November
మార్కెట్ కమిటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ కుమారుడికి భూమి పూజ చేశారు.
మండలంలోని మార్లగోoడ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం భూమి పూజ చేశారు. మిలన్, ప్రేమ్ బాయి గాలిసింగ్ తండా, అరుణబాయ్ కిరునాయక్ తండా లబ్ధిదారులు ఈ నిర్మాణ పనులను ప్రారంభించారు.
గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, తమ గ్రామానికి నూతన ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించాలని మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి, గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించారని, వారికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవికబాయ్ శ్యామ్ రావు, ఉప సర్పంచ్ రోహిదాస్, డైరెక్టర్ అరుణ్, కిషన్ జాదవ్, రాథోడ్ ఉత్తమ్, రాథోడ్ సంతోష్ యాదవ్, అంజేష్, రాథోడ్ శివరాం, దినేష్, రాథోడ్ శ్యామ్, గోకుల్, రాథోడ్ రామారావు, రాథోడ్ రాహుల్ మరియు తదితరులు పాల్గొన్నారు.






