కుబీర్, 12 November
బఆ్ఎస్ నాయకులు మృతుని కుటుంబానికి సంతాపం తెలిపారు.
మండల మాజీ జడ్పీటీసీ రమేష్ మాతృమూర్తి అయిన ఎల్లంత్వార్ నర్సుబాయి గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా నర్సుబాయి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో లోకేశ్వరం బీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపె శ్యాంసుందర్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ అనిల్, ఆత్మ చైర్మన్ సిద్ధంవార్ వివేక్, మాజీ వైస్ ఎంపీపీ సాయన్న, పిరాజీ, జోహరుద్దీన్, సోషల్ మీడియా కన్వీనర్ బండి ప్రశాంత్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.






