నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సావ్లి గ్రామానికి చెందిన బాసర మాజీ జడ్పీటీసీ సావ్లి రమేష్ తల్లి అల్లంత్వార్ నర్సుబాయి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సావ్లి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి నర్సుబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మాజీ భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సింధె ఆనంద్ రావు పటేల్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర బాయి రాజన్న, మాజీ జడ్పీటీసీ ఉత్తం భలేరావు, బాసర మండలం కిర్గిల్ బి మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, సోమనాథ్ పటేల్, ముధోల్ మౌలాఖాన్, బాశెట్టి లాలన్న తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.






