హైదరాబాద్, 12 November
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహం చేసుకున్నారు.
భారత వినోద, వ్యాపార ప్రపంచాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వేడుక అట్టహాసంగా ముగిసింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గ్రీస్‌లో జరిగిన లావిష్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఈ జంట ఏడడుగులు వేసింది.
పెళ్లి అనంతరం అనిరుధ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నూతన వధూవరుల తొలి ఫోటోలను పంచుకుంటూ, , 11.11 అంటూ భావోద్వేగపూరిత క్యాప్షన్ రాశాడు. క్షణాల్లోనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పెళ్లి వేడుకలో అనిరుధ్ సంప్రదాయ ఐవరీ లుక్‌లో మెరిసిపోయాడు. మ్యాచింగ్ కుర్తా-వేష్టీపై చక్కటి ఎంబ్రాయిడరీతో ఉన్న లాంగ్ జాకెట్ ధరించి క్లాసిక్‌గా కనిపించాడు. కావ్య బ్లష్-పింక్ లెహెంగాలో మెరిసిపోయింది. సీక్విన్ వర్క్, సున్నితమైన ఎంబ్రాయిడరీతో కూడిన లెహెంగా, మ్యాచింగ్ బ్లౌజ్, స్టేట్మెంట్ చోకర్, చెవికమ్మలతో ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంది. కో-ఆర్డినేటెడ్ పాస్టెల్ దుస్తుల్లో ఈ జంట ఎంతో ఎలిగెంట్‌గా కనిపించింది.
11న గ్రీస్‌లో వివాహ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ప్రముఖులు తరలివచ్చారు. అనిరుధ్‌కు రజనీకాంత్ స్వయానా మేనమామ అవుతారు.
అలాగే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుటుంబంతో కలిసి గ్రీస్‌కు బయలుదేరిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మొత్తంగా సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహం స్టార్ స్టడెడ్ ఈవెంట్‌గా మారింది.
గ్రీస్‌లో వివాహం తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. కావ్య తల్లిదండ్రులు కళానిధి మారన్, కావేరీ మారన్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించినట్లు తెలంగాణ సీఎంఓ పోస్ట్ ద్వారా తెలిసింది, దీంతో రిసెప్షన్ తేదీ ఖరారైంది.



