తానూర్, 11 November
భైంసా పట్టణంలో నూతన శ్రీ రాజరాజేశ్వర స్టీల్ మర్చంట్ దుకాణం ప్రారంభమైంది. గాంధీగంజ్ వెనుక భాగంలో, మహాలక్ష్మి ఆలయం సమీపంలో ఈ దుకాణాన్ని మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ప్రారంభించారు.
భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గాంధీగంజ్ వెనుక భాగంలో, మహాలక్ష్మి ఆలయం సమీపంలో మండలం ఝరి బి గ్రామానికి చెందిన ఆసమ్ మాధవ్ నూతనంగా శ్రీ రాజరాజేశ్వర స్టీల్ మర్చంట్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ దుకాణాన్ని మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దుకాణ యజమాని ఆసమ్ మాధవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులు, వ్యాపారవేత్తలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన పేర్కొన్నారు.






