పెంటఖుర్దు (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 09
పెంటఖుర్దు గ్రామంలో పేకాట కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని, అయితే అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో పేకాట నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వల్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పేకాట కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు పోలీసు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో తనిఖీలు నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
పేకాట కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందా లేదా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.