సారాంశం
మిర్యాలగూడ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. గతంలో ఎంపికైన లబ్ధిదారులకు...
ముఖ్య విషయాలు
- 1మిర్యాలగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీలో అన్యాయం: బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ
మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన నిరుపేదలకు గత శుక్రవారం జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీలో ఇళ్లు కేటాయించలేదని, వెంటనే అర్హులందరికీ పట్టాలు అందించాలని కోరుతూ సోమవారం బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు సాధినేని శ్రీనివాసరావు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఆర్డీవో ఎస్.
- 2రమణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
- 3అర్హులకే అన్యాయం చేశారని ఆరోపణ
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి, అత్యంత పారదర్శకంగా, వివిధ శాఖల అధికారుల సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయడం జరిగిందన్నారు.
- 4కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం మళ్లీ ఫీల్డ్ విచారణ నిర్వహించి వీరినే అర్హులుగా గుర్తించిందని, అయినప్పటికీ శుక్రవారం నిర్వహించిన పట్టాల పంపిణీలో ప్రస్తుత ప్రజాప్రతినిధుల కక్షపూరిత చర్యలతో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ కాలనీ, మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 09
మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన నిరుపేదలకు గత శుక్రవారం జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీలో ఇళ్లు కేటాయించలేదని, వెంటనే అర్హులందరికీ పట్టాలు అందించాలని కోరుతూ సోమవారం బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు సాధినేని శ్రీనివాసరావు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఆర్డీవో ఎస్. రమణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అర్హులకే అన్యాయం చేశారని ఆరోపణ
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి, అత్యంత పారదర్శకంగా, వివిధ శాఖల అధికారుల సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం మళ్లీ ఫీల్డ్ విచారణ నిర్వహించి వీరినే అర్హులుగా గుర్తించిందని, అయినప్పటికీ శుక్రవారం నిర్వహించిన పట్టాల పంపిణీలో ప్రస్తుత ప్రజాప్రతినిధుల కక్షపూరిత చర్యలతో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, విచారణ జరిపి అర్హులైన నిరుపేద లబ్ధిదారులందరికీ త్వరితగతిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను అందజేయాలని కోరారు.