మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇండ్ల కాలనీకి మహాత్మ జ్యోతిరావు పూలే పేరు పెట్టడాన్ని పురస్కరించుకుని, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి బీసీ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇండ్ల కాలనీకి మహాత్మ జ్యోతిరావు పూలే పేరు పెట్టడం పట్ల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పోలగాని వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో, మిర్యాలగూడ నియోజకవర్గ బీసీ సంఘాల నాయకులు శనివారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించారు. బీసీ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి సన్మానించారు.
కాలనీకి జ్యోతిరావు పూలే పేరు పెట్టడంపై హర్షం
ఈ సందర్భంగా వెంకటేశ్ గౌడ్, కన్వీనర్ మారం శ్రీనివాస్, దాసరాజు జయరాజులు మాట్లాడుతూ.. మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల కాలనీకి మహాత్మ జ్యోతిరావు పూలే పేరుతో నామకరణం చేయడం పట్ల యావత్ బీసీ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఈ నిర్ణయం బీసీ వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచేదని వారు అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాకునూరు బసవయ్య గౌడ్, దామరచర్ల సర్పంచ్ బంటు కిరణ్, దామరచర్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాలం వెంకన్న యాదవ్, కౌన్సిలర్ చెనగోని యాదగిరి, బలుగూరి శ్రీనివాస్, మనీ, ఎస్.కే. జానీ, యాదయ్య, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంఘం నాయకులు, దళిత సంఘ నాయకులు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.


