సిద్దిపేట జిల్లా మండలం మెట్టుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రారంభించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు హరీశ్ రావుకు ఘన స్వాగతం పలికారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామంలో భద్రత మరింత మెరుగుపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇది నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు దోహదపడుతుందని వారు విశ్వసిస్తున్నారు.
కెమెరాల ప్రారంభోత్సవం అనంతరం, ఎమ్మెల్యే హరీశ్ రావు గ్రామంలో మరణించిన కుటుంబాలను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ మాణిక్య రెడ్డి, కాముని శ్రీనివాస్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












