కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి పి. లావణ్య సూచించారు. మండలం మేడిపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి పి. లావణ్య సూచించారు.
మండలం మేడిపల్లి గ్రామంలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రైతులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు.
నమోదు చేసుకునే సమయంలో రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌తో అనుసంధానమైన సెల్‌ఫోన్ నంబరును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. రైతులు అవసరమైన పత్రాలతో ముందుగానే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె కోరారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో రైతు నమోదు కీలకమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.











