తానూరు మండలంలోని బొంద్రాట్ గ్రామంలో గ్రామీణ ప్రాంత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పొలంబాట రహదారి నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించి, పనులను ప్రారంభించారు. గ్రామంలోని రైతులకు వ్యవసాయ పనులకు రాకపోకలు సులభతరం చేయడంతో పాటు, పొలాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పనులు చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రవీందర్ పాటిల్ షిండే భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని, రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ బత్తి శివ, భాజపా నాయకులు నాగేందర్ పాటిల్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు పొలాలకు వెళ్లే దారి సౌకర్యవంతంగా మారనుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.












