సారంగాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ను కలిశారు. ఈ సందర్భంగా పలువురు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
సారంగాపూర్ మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, నిర్మల్ జిల్లా పార్టీ ఇన్చార్జ్ రామ్ కిషన్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ వచ్చిన నాయకుల సమక్షంలో సారంగాపూర్ మండలానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి వెన్నెముకలా నిలిచే కార్యకర్తలకు తాము ఎల్లవేళలా అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. కేటీఆర్ ను వారిలో బీఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ దేవిశంకర్, మండల నాయకుడు మధుకర్ రెడ్డి, సీనియర్ నాయకులు జీవన్ రావు, చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు నాగుల రామ్ రెడ్డి, దత్తురాం, వంజర్ మాజీ సర్పంచ్ శ్యామ్ రెడ్డి, మండల నాయకులు వంగ చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్ పాకాల సతీష్ గౌడ్, ఇతర ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.











