మోర్తాడ్ మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను మాజీ ప్రభుత్వ విప్ ఇరవత్రి అనిల్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాగేంద్రబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగ ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యదర్శి గోపి, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పుప్పాల అశోక్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తీగల సంతోష్, సీనియర్ నాయకులు కురుమ నరేష్, భూపతి నరేందర్, అబ్బాస్, భోగ రమేష్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


