మండలంలోని రాజు తండా గ్రామంలో దసరా పండుగ సందర్భంగా జగదాంబ మాత ఆలయంలో తీజ్ నవధాన్యాల పూజలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగాయి. అలాగే, గ్రామంలోని జగదాంబ మాత, సేవా లాల్ మహారాజ్ ఆలయాల్లో భోగ్ భండారా పూజలు నిర్వహించారు.
మండలంలోని రాజు తండా గ్రామంలో దసరా పండుగ సందర్భంగా జగదాంబ మాత ఆలయంలో తీజ్ నవధాన్యాల పూజలు తొమ్మిది రోజుల పాటు జరిగాయి. అలాగే, గ్రామంలోని జగదాంబ మాత, సేవా లాల్ మహారాజ్ ఆలయాల్లో భోగ్ భండారా పూజలు నిర్వహించారు.
ఈ పూజల్లో ఆలయ పూజారి మోహన్, గ్రామ పెద్దలు రాథోడ్ రఘునాత్ నాయక్, కారొభరి రామారావు, డవ్ శంకర్, సానో భీం రావు, గ్రామ యువతీ యువకులు, ఆడపడుచులు పాల్గొన్నారు.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ, గ్రామంలో పాడిపంటలు, ప్రకృతి, పశువులు ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నారు. ఈ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

