బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు బోస్లే మోహన్ రావు పటేల్ విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థుల చిరునవ్వులోనే నిజమైన సంతృప్తి ఉందని ఆయన అన్నారు. విద్యార్థుల ఆత్మీయ పలకరింపుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఆయనను విద్యార్థులు ఆప్యాయంగా పలకరిస్తూ సార్.. బాగున్నారా అని అడిగారు. విద్యార్థుల ఆత్మీయ పలకరింపుకు ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ వారితో కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థుల చిరునవ్వులోనే నిజమైన సంతృప్తి ఉందని ఈ సందర్భంగా బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల చదువు, భవిష్యత్తు గురించి మాట్లాడిన మోహన్ రావు పటేల్, శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆశీస్సులతో విద్యార్థులందరూ విద్యారంగంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, గ్రామానికి, సమాజానికి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని కోరారు.

