బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారిని కాళరాత్రి దేవిగా అలంకరించి పూజిస్తారు. మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది కాబట్టి అమ్మవారికి కాళరాత్రి అనే పేరు వచ్చింది.
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారిని కాళరాత్రి దేవిగా పూజిస్తారు. కాళ అనగా మృత్యువు, రాత్రి అంటే అజ్ఞానం, చీకటి. మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది కాబట్టి అమ్మవారికి కాళరాత్రి అనే పేరు వచ్చింది.
కాళరాత్రి దేవి స్వరూపం
ఈ అమ్మవారు భయంకరమైన రూపంతో, శత్రు సంహారిణిగా ఉంటుంది. నల్లని రూపం, పొడవాటి జడలు, మెడలో పుర్రెలు, రక్తం తాగుతున్నట్లుగా కనిపించే నోరు, చతుర్భుజాలు, గాడిద వాహనంతో భయంకరంగా దర్శనమిస్తుంది. అయినప్పటికీ, భక్తులకు ఆమె అభయప్రదాతగా నిలుస్తుంది.
వరప్రదాయిని అయిన కాళికాదేవి
కాళికాదేవి శనిగ్రహానికి అధిపతి. ఈమె తన కుడిచేతి వరద ముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరో కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్ని, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. ఈరోజు అమ్మవారికి కదంబం (కిచిడి) నైవేద్యంగా సమర్పిస్తారు.
కాళరాత్రి దేవి ధ్యాన శ్లోకం
ఏకవేణీ జపాకర్ణపురా నగ్నా ఖరస్థితా లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ

