దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైన మూల నక్షత్రం సందర్భంగా జిల్లా బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన సతీమణి విజయలక్ష్మితో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన దంపతులకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మహా సరస్వతి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించగా, అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పీవీ రమణారెడ్డి, కోఆప్షన్ మెంబర్ మేడారం ప్రదీప్, మండల కన్వీనర్ మలేష్, పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాకాల రాంచందర్, మాజీ సర్పంచ్ పి. రమేష్ రెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొప్పుల శ్రీధర్, రవికిరణ్, రమేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

