మండలంలోని అష్ట గ్రామాన్ని చెత్త రహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రేపు ఉదయం 9:30 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, సిబ్బంది హాజరుకానున్నారు.
మండలంలోని అష్ట గ్రామాన్ని చెత్త రహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రేపు ఉదయం 9:30 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి డీఎల్పీవో, ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ అధికారులు, సిబ్బందితో పాటు ఎస్సై పాల్గొననున్నారు.
గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వీడీసీ కమిటీ సభ్యులు, మహిళా సంఘాలు, యువతీ యువకులు, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రం, వెటర్నరీ సిబ్బంది, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, రేషన్ డీలర్తో పాటు గ్రామ ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్ కోరారు.
చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేర్వేరుగా విభజించి నిర్ణీత చెత్తబుట్టల్లో వేయాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ చెత్త విభజనను అలవాటు చేసుకొని గ్రామ పరిశుభ్రతకు సహకరించాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.












