తొమ్మిదో పోషణ మాసంలో భాగంగా మన అంగన్వాడీ.. మన బాధ్యత కార్యక్రమాన్ని లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎంపీడీవో కార్యాలయంలో బాలల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నివారణ, బాలలపై జరిగే హింసను అరికట్టడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాలలకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు బాలల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. బాలల రక్షణకు గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జనార్ధన్, అంగన్వాడీ పర్యవేక్షకురాలు శారద, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు, సిబ్బంది, బాలల పరిరక్షణ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు
Share:

సారాంశం
పోషణ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం, బాలల హక్కులపై విస్తృత చర్చ
ముఖ్య విషయాలు
- ఈ సందర్భంగా మండల ఎంపీడీవో కార్యాలయంలో బాలల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.
- ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నివారణ, బాలలపై జరిగే హింసను అరికట్టడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
- బాలలకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
- తొమ్మిదో పోషణ మాసంలో భాగంగా మన అంగన్వాడీ..
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4137ఆర్టికల్స్
4,95,260వ్యూస్










