ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిజెపి మండల నాయకుడు రవి, తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, బిజెపి మండల నాయకుడు రవి, బిజెపి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకు పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు.
మండలంలోని పల్సి గ్రామానికి చెందిన బిజెపి మండల సీనియర్ నాయకుడు రవి, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని, వాటికి ఆకర్షితులై అనేకమంది ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు.
ఈ చేరిక కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు లోకేశ్వరం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్త గౌడ్, వార్డ్ మెంబర్ కామాజీ, పాల రాకేష్, తోట రవి, తోట దత్తు, పోతన్న, మాదన్న, సాయినాథ్, పవన్, మాజీ సర్పంచ్ శ్రావణ్, మాజీ సర్పంచ్ దత్తు గౌడ్ తో పాటు పలువురు మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











