మండల కేంద్రంలోని పీయం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో అర్హులైన విద్యార్థినులకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. డాక్టర్ ప్రణవి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు నిండిన, 15 సంవత్సరాలలోపు వయస్సు గల అర్హులైన విద్యార్థినులకు వ్యాక్సిన్ అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రణవి మాట్లాడుతూ హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వైరస్ సంబంధిత కొన్ని వ్యాధుల నుంచి రక్షణ పొందడంలో వ్యాక్సినేషన్ పాత్రను విద్యార్థినులకు వివరించారు. అర్హత కలిగిన వయస్సులో వ్యాక్సిన్ తీసుకోవడం భవిష్యత్తులో ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.
పాఠశాల యాజమాన్యం స్పందన
పాఠశాల ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పాఠశాల ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విద్యతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కూడా ఎంతో ముఖ్యమని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది సూచనలను పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి, డాక్టర్ ప్రణవి, సూపర్వైజర్ నిర్మల, ఏఎన్ఎం స్వరూప, ఆశా వర్కర్ శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.

