భద్రాద్రి జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త సాయిబానుకు బెస్ట్ ఎక్సలెన్స్ సోషల్ సర్వీస్ అవార్డు 2026 లభించింది. ఆత్మకూరు బోనగిరిలో భారత రక్తదాన సేవా మిషన్ అసోసియేషన్ ఈ పురస్కారాన్ని ఆమెకు అందజేసింది. తన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకున్నారు.
సాయిబాను సమాజ సేవలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె ఉచితంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా, ఎం పవర్ మెంట్ ఆఫ్ ది ఉమెన్స్ వారియర్ సొసైటీలో పనిచేస్తూ మహిళలకు ఉచిత బ్యూటీషియన్ కోర్సులు నేర్పిస్తున్నారు. అలాగే, హ్యూమన్ రైట్స్ సొసైటీలో ఉమెన్ వింగ్ కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వృద్ధులు, అనాథలు, ఒంటరిగా జీవనం సాగిస్తున్న వారందరికీ ఆమె తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. భద్రాద్రి వంటి మారుమూల, వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్ స్థాయికి తన కష్టంతో ఎదగడం నిజంగా గొప్ప విషయమని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులను ఆమె గతంలోనూ అనేక సార్లు అందుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తేనే ఇలాంటి గుర్తింపు లభిస్తుందని, ఈ సేవా కార్యక్రమాల్లో భాగం కావడం తనకు దక్కిన అదృష్టమని సాయిబాను పేర్కొన్నారు.
తాను చేసే సహాయంలో ఇతరులు కూడా భాగస్వాములై, తమకు తోచిన సహాయం చేయాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా తన వంతు సేవ చేస్తున్నానని, దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, అవార్డులు అందుకుంటూ ముందుకు సాగుతానని భాను తెలిపారు. తనను సంప్రదించాలనుకునేవారు 7729923205 నంబర్లో సంప్రదించవచ్చు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని భారత రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షుడు బాబు, జనరల్ సెక్రటరీ హేమంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

