దండోరా ఉద్యమంలో మాదిగ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని సందీప్ గార్డెన్లో జిల్లా సమావేశానికి మాదిగ మహిళా సమాఖ్య సభ్యులు, కుల సభ్యులు తరలిరావాలని కోరుతూ శనివారం బస్తీబస్తీ ప్రచారం నిర్వహించారు.
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమానికి తుడం బలమని మాదిగ, గండం గంగమ్మ మాదిగ, గంగజము మాదిగ నేతృత్వం వహించారు. అర్బన్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ జిల్లా సమావేశం గురించి సభ్యులకు వివరించారు.
దండోరా ఉద్యమంలో మహిళలు క్రియాశీలకంగా పాల్గొని తమ హక్కుల కోసం ముందుకు రావాలని నాయకులు కోరారు. జిల్లా సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎంఆర్పీఎస్ అర్బన్ నియోజకవర్గం, నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈ ప్రచారం నిర్వహించారు.


