భైంసా, 15 November
ముధోల్ నియోజకవర్గంలో 5,251 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. రేపటి నుండి పింఛన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించనున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గంలో 5,251 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, 4,606 మంది లబ్ధిదారులను అధికారులు అర్హులుగా గుర్తించారు.
ముధోల్ నియోజకవర్గంలో 5,251 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. రేపటి నుండి పింఛన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించనున్నట్లు ఆయన చెప్పారు. ముధోల్ నియోజకవర్గంలో 5,251 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, 4,606 మంది లబ్ధిదారులను అధికారులు అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. వివిధ కారణాలతో 360 మంది లబ్ధిదారుల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారని, 255 దరఖాస్తులు హోల్డ్‌లో పెట్టినట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అర్హులకు త్వరలో పింఛన్ అందిస్తామని చెప్పడం శుభ సూచకమని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండలంలో 341 మందికి, బైంసా పట్టణంలో 686 మందికి, బైంసా మండలం లో 566 మందికి, కుబీర్ మండలంలో 720 మందికి, కుంటాల మండలంలో 283 మందికి, లోకేశ్వరం మండలం లో 462 మందికి, ముధోల్ మండలంలో 533 మందికి, తానూర్ మండలం లో 775 మందికి, నర్సాపూర్ మండలం లో 240 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు అయినట్లు తెలిపారు. వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లు కార్మికులకు ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసిందని, అదేవిధంగా నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో వృద్ధులు, బీడీ కార్మికులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారని, తక్షణమే అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలని కోరారు.

