నర్సాపూర్-G (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 14
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన నాలుగు మహిళా సమాఖ్య () భవనాలను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గ్రామ అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం, మహిళల ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన అంశాలపై ఆయన గ్రామస్తులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నోళ్ల విజయలక్ష్మి ప్రవీణ్, ఉప సర్పంచ్ కమ్రుద్దీన్, వార్డు సభ్యులు నరేష్, బీజేపీ సీనియర్ నాయకులు రమణ రెడ్డి, ముత్యం రెడ్డి, జమాల్, సత్యం చంద్రకాంత్ (బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు), బీజేపీ నాయకులు ఠాకూర్ అర్జున్, మహిపాల్, అనిల్, గోవర్ధన్, శ్రీనివాస్, ప్రణీత్ తదితరులతో పాటు సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


