పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ సంస్థ 3, ఫరెవర్ కెమికల్స్గా పిలిచే పీఎఫ్ఏఎస్ () రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆరోపిస్తున్న బాధితులకు పరిహారం చెల్లించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 7.35 బిలియన్ డాలర్ల (సుమారు రూ.61 వేల కోట్లకు పైగా) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా లక్షలాది మంది బాధితులకు ప్రయోజనం చేకూరనుంది.
అమెరికాలోని పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ సంస్థ 3 కీలక నిర్ణయం తీసుకుంది. ఫరెవర్ కెమికల్స్గా పిలిచే పీఎఫ్ఏఎస్ () రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆరోపిస్తున్న బాధితులకు పరిహారం చెల్లించేందుకు 7.35 బిలియన్ డాలర్ల (సుమారు రూ.61 వేల కోట్లకు పైగా) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిష్కార ఒప్పందం ద్వారా సుమారు 1.15 లక్షల నుంచి 1.20 లక్షల మంది బాధితులకు ప్రయోజనం చేకూరనుంది.
తొమ్మిదేళ్లలో పరిహారం చెల్లింపు
ఈ ఒప్పందం ప్రకారం 3 సంస్థ తొమ్మిదేళ్ల వ్యవధిలో పరిహారం చెల్లించనుంది. 2026లో 50 మిలియన్ డాలర్లు చెల్లించనుంది. 2027లో ఎలాంటి చెల్లింపులు ఉండవు. మొత్తం పరిహారంలో సుమారు 20 శాతం చివరి రెండేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం వల్ల ప్రస్తుత వ్యక్తిగత ఆరోగ్య నష్టం కేసుల్లో దాదాపు 99 శాతం పరిష్కారమవుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.
ఏమిటీ ఫరెవర్ కెమికల్స్
పీఎఫ్ఏఎస్ (పర్ అండ్ పాలీఫ్లోరో ఆల్కైల్ సబ్స్టాన్సెస్) అనేవి మానవ నిర్మిత రసాయన సమ్మేళనాలు. నీరు, నూనె, మరకలు, వేడిని తట్టుకునే లక్షణాలు ఉండటంతో వీటిని వివిధ పారిశ్రామిక ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. ముఖ్యంగా అగ్నిమాపక నురుగు, మరకలు అంటుకోని వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. పర్యావరణంలో, మానవ శరీరంలో సులభంగా విచ్ఛిన్నం కాకపోవడంతో వీటికి ఫరెవర్ కెమికల్స్ అనే పేరు వచ్చింది.
ఆరోగ్యంపై ప్రభావాలు
ఈ రసాయనాలకు గురికావడం వల్ల మూత్రపిండాలు, వృషణాల క్యాన్సర్ ప్రమాదం, కాలేయ సమస్యలు, శిశువుల తక్కువ జనన బరువు, టీకాల ద్వారా ఏర్పడే రోగనిరోధక ప్రతిస్పందన తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అగ్నిమాపక నురుగులోని రసాయనాలు తాగునీటిని కలుషితం చేశాయని, తద్వారా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నామని పలువురు కోర్టులను ఆశ్రయించారు.
ఈ ఒప్పందం కారణంగా 2026 నాలుగో త్రైమాసికంలో 5.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.48 వేల కోట్ల) పన్నుకు ముందరి ఆర్థిక భారాన్ని నమోదు చేయనున్నట్లు 3 వెల్లడించింది. అయితే ఈ పరిహార ఒప్పందం తమ గతంలో ప్రకటించిన 2026 ఆర్థిక అంచనాలను మార్చబోదని స్పష్టం చేసింది. 2025 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా పీఎఫ్ఏఎస్ రసాయనాల తయారీని నిలిపివేయాలన్న లక్ష్యాన్ని చేరుకున్నామని కంపెనీ తెలిపింది. ఈ ఒప్పందం బాధ్యతను అంగీకరించినట్లు కాదని, ఒప్పంద నిబంధనలు నెరవేరని పరిస్థితుల్లో న్యాయపోరాటం కొనసాగిస్తామని వెల్లడించింది.
2023లో అమెరికాలోని పలు ప్రభుత్వ తాగునీటి సరఫరా సంస్థలకు పీఎఫ్ఏఎస్ కాలుష్య సమస్య పరిష్కారం కోసం 3 సుమారు 10.3 బిలియన్ డాలర్ల వరకు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా వ్యక్తిగత ఆరోగ్య నష్టం కేసుల పరిష్కారానికి మరో భారీ ఒప్పందం కుదిరింది.












