आంధ్రప్రదేశ్, 16 September
ఆంధ్రప్రదేశ్లో పురపాలక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. 12 నగరపాలికలు, 29 పురపాలికల్లో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 22న వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో పురపాలక ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం 12 నగరపాలికలు, 29 పురపాలికల్లో ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. ఈ మేరకు రెండు ప్రత్యేక నోటిఫికేషన్లపై ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా సంతకాలు చేశారు.
ఓటర్ల జాబితా ప్రచురణ
వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఈ నెల 22న ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ జాబితా ప్రకటించిన తర్వాత మేయర్లు, చైర్మన్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు మార్గం సుగమం కానుంది.












