మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 150 మంది లబ్ధిదారులకు రూ.1.50 కోట్లకు పైగా విలువైన చెక్కులను అందజేశారు.
మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన 150 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1,50,17,400 విలువైన చెక్కులను అందజేయడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆడబిడ్డల వివాహాల సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, కౌన్సిలర్లు మలగం రమేష్, జావిద్, ఫరూక్ మహమ్మద్, వన్ టౌన్, టూ టౌన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోడిరెక్క ఇంద్రకుమార్, మోయిజ్, ఇంచార్జులు దేశిడి శేఖర్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

