నిర్మల్, 9 November
ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు, వినతులను ఆమె స్వయంగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు తమ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వారికి భరోసా కల్పించడం, వారి మాటలను ఓపికగా వినడం, సమస్యను అర్థం చేసుకొని చట్టప్రకారం పరిష్కారం చూపడం ప్రతి పోలీసు అధికారి బాధ్యత అని ఎస్పీ తెలిపారు.
ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా పనిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






