జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సైబర్ వారియర్స్‌తో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సైబర్ నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసుల పరిష్కారంపై ఆమె సమీక్షించారు.
సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను త్వరగా దర్యాప్తు చేసి పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రతి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
ఇ-పెట్టి కేసులను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఏ కేసును కూడా అనవసరంగా పెండింగ్‌లో ఉంచవద్దని ఎస్హెచ్ఓలకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించిన డీడీలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఈ విషయంలో ఎలాంటి జాప్యం చేయవద్దని ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఉపేందర్ రెడ్డి, సీఐలు కృష్ణ, మల్లేష్, ఎస్సైలు లింబాద్రి, అశోక్, ముత్యం, మహిళా ఎస్సై శ్రావణితో పాటు డీసీఆర్బీ, ఐటీ కోర్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.

