సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమని ఐసీడీఎస్ ముధోల్ ప్రాజెక్టు సీడీపీఓ రాజశ్రీ సూచించారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.
ప్రతిఒక్కరూ ప్రతిరోజూ సమతుల ఆహారం తీసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనానికి పౌష్టికాహారం ఎంతో అవసరమని సీడీపీఓ రాజశ్రీ తెలిపారు. ఆయుర్వేద వైద్యురాలు లలిత మాట్లాడుతూ, గర్భిణులు, బాలింతలు వైద్యుల సూచనల మేరకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నిఖిత, గ్రామపంచాయతీ సర్పంచ్ సుగంధ, కార్యదర్శి షఫీక్, ఐసీడీఎస్ సిబ్బంది రోజా, అంగన్వాడీ టీచర్లు వందన, శోభ, మనీషా, సావిత్రి, అనిత, సరస్వతి, సురేఖ, చంద్రకళ, నందబాయి, వాణి, సంగీత, సవిత, అర్చన, లక్ష్మి తదితరులతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.












