తమిళనాడులో సినిమా పరిశ్రమకు ఊరటనిస్తూ, కొత్తగా విడుదలయ్యే సినిమాలకు రోజుకు ఆరు షోలు ప్రదర్శించేందుకు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అనుమతి మంజూరు చేశారు. ఈ నిర్ణయం నిర్మాతలు, థియేటర్ల యజమానులకు ప్రయోజనం చేకూర్చనుంది.
కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలకు, విడుదలైన మొదటి వారం పాటు రోజుకు ఆరు షోలు ప్రదర్శించేందుకు అనుమతిని మంజూరు చేశారు. ఈ ప్రదర్శనలు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2:30 గంటల వరకు నిర్వహించుకోవచ్చు. శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు, స్థానిక పండుగ రోజుల్లో కూడా ఈ వెసులుబాటు వర్తిస్తుంది. సినిమా నిర్మాతలు మరియు థియేటర్ల యజమానుల సంఘాల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2023లో అజిత్ నటించిన తునివు సినిమా విడుదల సందర్భంగా జరిగిన అభిమాని మృతి ఘటన నేపథ్యంలో నిలిచిపోయిన తెల్లవారుజామున ఆటలు, ఈ నిర్ణయంతో మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. త్వరలో విడుదల కానున్న సూర్య నటించిన సీన్, నయనతార నటించిన మూకుత్తి అమ్మన్ 2 సినిమాలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చనుంది.


