హైదరాబాద్కు చెందిన బొమ్మ కంటి సహస్ర అనే బాలిక కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. మూడో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ఇప్పటికే సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వంటి పలు దేశాల్లో తన నృత్య ప్రదర్శనలతో అలరించింది.
హైదరాబాద్కు చెందిన బొమ్మ కంటి మానస, హరీష్ గౌడ్ దంపతుల కుమార్తె, బోసికి చెందిన బొమ్మ కంటి సహస్ర కూచిపూడి నృత్యంలో ప్రతిభ చాటుతోంది. మూడో తరగతి చదువుతున్న సహస్ర, ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, నేపాల్, శ్రీలంక తదితర దేశాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని, తన నృత్య ప్రతిభను ప్రదర్శించింది. బుధవారం బోసిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో, చిన్నారి సహస్ర కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకుంది. సంప్రదాయ నృత్యరీతిలో ఆమె ప్రదర్శించిన నృత్యానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. చిన్న వయసులోనే కూచిపూడి నృత్యంపై ఆసక్తి పెంచుకుని, దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ ప్రతిభను చాటుతున్న సహస్రను పలువురు అభినందించారు.












